Andhra PradeshPolitical

ఆదర్శ పాఠశాలలో ముగ్గురు సస్పెండ్

ఆదర్శ పాఠశాలలో ముగ్గురు సస్పెండ్

ఆదర్శ పాఠశాలలో ముగ్గురు సస్పెండ్

మరో ఇద్దరు ను ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారులు

పల్నాడు జిల్లా కారంపూడిలోని ఆదర్శ పాఠశాలలో ఇంగ్లీష్ బోధించే బి.రవికుమార్ విద్యార్థినులను ల్యాబ్ కు పిలిపించి, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇటీవల 9వ తరగతి చదువుతున్న ఐదుగురు విద్యార్థినులతో అలాగే ప్రవర్తించడంతో పాటు వారికి రాత్రి సమయాల్లో ఫోన్లు, మెసేజ్ లు చేస్తున్నాడు.

ఈ విషయాన్ని ఓ తండ్రి గమనించి.. తమ కుమార్తెను ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కొందరు తల్లిదండ్రులు కలిసి గురువారం పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. ప్రిన్సిపల్ నయోమి ఆ ఉపాధ్యాయుడిని రక్షించి, తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

విషయం తెలుసుకున్న ఎంఈఓ రవికుమార్ పోలీసులకు సమాచారం ఇచ్చి, పాఠశాల వద్దకు చేరుకుని వివరాలు సేకరించారు. ఘటనపై ఆర్జేడీ, డీఈఓలకు తెలిపారు. అధికారులు విచారిస్తుండగా మరోసారి ఉపాధ్యాయుడిపై తల్లిదండ్రులు దాడికి దిగడంతో పోలీసులు అతడిని స్టేషన్ కు తరలించారు.

ఆగ్రహంతో ఉన్న తల్లిదండ్రులు ప్రిన్సిపల్ పైనా దాడిచేశారు. ఎస్సై అమీర్ బాధిత విద్యార్థినుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. సాయంత్రం ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి, డీఈఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డీఈఓ ఏసుబాబు పాఠశాలకు చేరుకుని విచారణ చేశారు.

ఉపాధ్యాయుడు రవికుమార్, ప్రిన్సిపల్ నయోమి, వైస్ ప్రిన్సిపల్ శుభశ్రీలను సస్పెండ్ చేశారు. కీచక ఉపాధ్యాయుడికి సహకరించిన జూనియర్ అసిస్టెంట్ ఖాజావలి, బాలికల వసతిగృహ వార్డెన్ నాగలక్ష్మిని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button