HealthManchiryalaPoliticalTelangana

కాలేజీ బిల్డింగ్‌ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కాలేజీ బిల్డింగ్‌ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కాలేజీ బిల్డింగ్‌ పై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కళాశాల వసతి గృహంపై నుంచి దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన బుధవారం ఉదయం కలకలం రేపింది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కాలేజ్ రోడ్డులో గల తెలంగాణ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ కళాశాలలో బీజెడ్సీ సెంకండ్ ఇయర్ చదువుతోన్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (19) అనే విద్యార్థిని మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో వసతి గృహం భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

తీవ్ర గాయాలపాలైన విద్యార్థినినీ హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు మంచిర్యాల ప్రభుత్వ జనరల్ దవాఖానకు తరలించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు.

స్వప్న పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ఘటనపై మంచిర్యాల పట్టణ ఎస్ఐ తిరుపతిని వివరణ కోరగా విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం వాస్తవమేనని, మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కరీంనగర్ నుంచి హైదరాబాద్ కు తరలించారనన్నారు. ఆత్మహత్యయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు.

కాగా ఏప్రిల్ 24న భీమిని మండలం జగ్గయ్యపేటకు చెందిన జంగంపల్లి లక్ష్మీప్రసన్న (19) బీకాం జనరల్ సెకండియర్ చదివే విద్యార్థిని ఇదే కళాశాలలో భవనం పై నుండి దూకి ఆత్మహత్య కు పాల్పడిన విషయం తెలిసిందే.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button