Telangana

యువ డాక్టర్ సంధ్యకు సలాం..

యువ డాక్టర్ సంధ్యకు సలాం..

బెంగళూరు నుంచి వచ్చి..
“పాలేరు” పరిధి పెద్ధతండాలో ఓటేసి..

ఖమ్మం రూరల్: ప్రజాస్వామ్యంలో వజ్రాయుధమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకు బెంగళూరులో విధులు నిర్వర్తిస్తున్న యువ డాక్టర్ (ఎంబీ బీఎస్ )పెరుమాళ్లపల్లి సంధ్య పాలేరు నియోజకవర్గానికి వచ్చారు. తన భర్త పెరుమాళ్లపల్లి శరత్ చంద్ర తో కలిసి గురువారం పెద్ధతండా గ్రామ పంచాయతీలోని బూత్ నంబర్ 131 పరిధి అంగన్వాడీ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజ్యాంగం కల్పించిన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునేందుకే అక్కడి నుంచి వచ్చినట్లు తెలిపారు. తద్వారా ప్రజాస్వామ్యం లో మేలైన తీర్పు నిచ్చే అవకాశాన్ని వదులుకోవద్దు అని యువతీయువకులకు సందేశం ఇచ్చి ఆదర్శంగా నిలిచారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button