Telangana

ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య...

ప్రభుత్వ ఉపాధ్యాయుడి దారుణ హత్య…

ఆదిలాబాద్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ ఉపాధ్యాయుడిని దారుణంగా కొట్టి హత్య చేసిన సంఘటన కలకలం రేపింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజేందర్ అనే ఉపాధ్యాయుడు బుధవారం పాఠశాల పున ప్రారంభం కావడంతో విధులకు హాజరయ్యేందుకు గాను నార్నూర్ మండలంలోని తన స్వగ్రామం నాగుల కోయ నుంచి జైనథ్ మండలంలోని మేడిగూడ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలకు విధుల నిమిత్తం బైక్ పై బయలుదేరాడు.

నార్నూర్ మండలంలోని అర్జుని,లోకారి మధ్యలో గల అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అతనిపై దాడి చేసి హతమార్చారు.

అయితే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని సంబంధిత మండల పోలీసులు దీనిపై విచారణ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వెల్లడించారు.

కాగా మృతుడు గజేందర్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నట్లు సమాచారం. అయితే ఈ హత్యకు కుటుంబ తగాదాల కారణమే అయి ఉంటుందేమోనని పలువురు అనుమానిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button