HyderabadPoliticalTelangana

కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం… ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు

కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం… ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు

కేటీఆర్‌ అరెస్టుకు రంగం సిద్ధం… ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసు(Formula E-Car Race Case) లో రెండోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు.. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కీలక ‍వ్యాఖ్యలు చేశారు.

ఆయన విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణభవన్, కమాండ్ కంట్రోల్ సెంటర్,ఏసీబీ ఆఫీసు పరిసరాల్లో 2వేల మంది పోలీసుల మోహరించారు.

చుట్టుపక్కల షాపులు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఎసీబీ ఆఫీసుకు చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్కడి నుంచి పంపించి వేస్తున్నారు. తెలంగాణ భవన్ను తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు దానికి తాళం వేశారు.

కాగా కేటీఆర్ను అరెస్ట్ చేస్తే తదుపరి చర్యల కోసం న్యాయనిపుణులను ఆశ్రయించిన హరీశ్ రావు. ఇప్పటికే పార్టీ న్యాయ విభాగంతో ఆయన సమావేశమయ్యారు. కాగా విచారణకు వెళ్లే ముందు తన అరెస్ట్ ఖాయమంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు.

నన్ను అరెస్ట్ చేస్తారేమో…కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫార్ములా ఈ-కార్ రేసు కేసులో మరోసారి ఏసీబీ విచారణకు హాజరయ్యే ముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సంచలన వ్యాఖ్యలు చేశారు.

నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారు. ఏసీబీ విచారణకు పిలిచి రాక్షస ఆనందం పొందుతున్నారు. అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు. మాకు జైలు కేసులు కొత్త కాదు గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా జైలుకు వెళ్లొచ్చాను.

రేవంత్ కక్ష సాధింపు చర్యలలో భాగంగా చేస్తున్నాడు. ఇలాంటి చర్యలకు భయపడం…ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తూనే ఉంటాం అన్నారు.జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అక్రమ కేసులతో తనను లక్ష్యంగా చేసుకుని రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేనని ఆరోపించిన ఆయన, జైలుకు వెళ్ళేందుకు కూడా తాను సిద్ధమని స్పష్టం చేశారు.

‘విచారణ పేరుతో ఆరు నెలలుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఏం తేల్చారు? నాకు ముందే తెలుసు.. ఫార్ములా ఈ-రేసు కేసులో అరెస్ట్ చేస్తారనే విషయాన్ని. అయినా నాకు భయం లేదు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జైలుకు వెళ్లడంలో ఎలాంటి భయం లేదు.

నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు జైలుకెళ్లాను. ఈ అంశాన్ని నాలుగు గోడల మధ్య విచారణకు పరిమితం చేయకుండా, అసెంబ్లీ సాక్షిగా ప్రజల ముందు చర్చించేందుకు సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు.

ఇక రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేస్తూ, ‘‘ప్రపంచం దృష్టిలో అభాసుపాలైన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పటి వరకు ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోదగ్గ పని ఏదీ చేయలేకపోయింది. రైతుబంధును ఎలక్షన్ బంధుగా మార్చేశారన్నారు.

బీసీల రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావిస్తూ, 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆ ఉద్దేశం లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికల బాట పట్టిందన్నారు. బీసీలు అన్నీ గమనిస్తున్నారు. మేము వారి తరపున నిలబడి, ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వాన్ని నిరంతరం నిలదీస్తూ ఉంటామన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button