HyderabadPoliticalRangareddyTelangana

మహిళా ప్రొఫెసర్ కి లైంగిక వేధింపులు...

మహిళా ప్రొఫెసర్ కి లైంగిక వేధింపులు...

మహిళా ప్రొఫెసర్ కి లైంగిక వేధింపులు…

Web desc : రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

విశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్లర్ ఇతర సిబ్బందిపై లైంగికంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల బృందం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు మాత్రం… ఇది ఒక్కరి సమస్య కాదని, యూనివర్సిటీలో పని చేసే ప్రతి ఒక్కరి గౌరవానికి సంబంధించిన అంశమని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్డాస్ జానయ్ లైంగిక వేధింపులు తట్టుకోలేక తిరగబడ్డ టీచింగ్ స్టాఫ్ మరియు విద్యార్థులు విద్యార్థినులు

వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?

మహిళా ప్రొఫెసర్‌కు అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు?

లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో TASA అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న నిరసనలు.
ఒక మహిళా ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు గురైంది అంటే రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు?

ఒక మహిళా ప్రొఫెసర్ ముందుకొచ్చి వైస్ ఛాన్సలర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడు అని చెప్పింది అంటే ఆమె ఆవేదన అర్థం అవుతుంది

మహిళలు వాళ్ళ క్యారెక్టర్ గురించి అబద్ధాలు చెప్పరు.. ఆమెకు ఇంకా చాలా సర్వీస్ మిగిలి ఉంది

లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే విధుల నుంచి తొలగించాలి కానీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యను ఈ ప్రభుత్వం కాపాడుతుంది

ప్రభుత్వం నుండి అల్డాస్ జానయ్యపై ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు? -తోటి మహిళా ప్రొఫెసర్

వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్

అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు

మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య

డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు – బాధిత మహిళా ప్రొఫెసర్

యూనివర్సిటీ ప్రాంగణంలో ఆందోళన చేపట్టిన విద్యార్థులు, అధ్యాపకులు… ఈ విషయంపై నిష్పాక్షిక విచారణ జరపాలని, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

న్యాయం జరిగేంత వరకు తమ ఉద్యమాన్ని ఆపబోమని వారు స్పష్టం చేశారు. వీసీపై వచ్చిన ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని, బాధ్యులను కాపాడే ప్రయత్నం చేయవద్దని ఆందోళనకారులు హెచ్చరించారు.

ఈ ఆందోళనతో యూనివర్సిటీలో తరగతులు, పరిపాలనా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలిసిన వెంటనే యూనివర్సిటీ అధికారులు, పోలీసులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button