Khammam

31న చలో హైదరాబాద్

31న చలో హైదరాబాద్

రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయండి

జర్నలిస్టులకు ఆకుతోట ఆదినారాయణ.. చిర్రా రవి పిలుపు
ఖమ్మం మే29: ఈనెల 31న హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్ లో జరిగే టి యు డబ్ల్యూ జే (టి జే ఎఫ్ ) 25 ఏళ్ల రజతోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి జే ఎఫ్ ) ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు పిలుపునిచ్చారు.

టియుడబ్ల్యూ జే (టి జే ఎఫ్ ) జిల్లా ముఖ్య నాయకుల సమావేశం గురువారం టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో జరిగింది. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జర్నలిస్టుల కృషి మరువలేని దాన్ని, జర్నలిస్ట్ యూనియన్ గా ఆవిర్భవించి 25 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా రజతోత్సవ వేడుకలను హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టు లో పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం తమ యూనియన్ నిరంతరం పనిచేస్తుందని, అందులో భాగంగా పలు తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టి జే ఎఫ్ ) జాతీయ నాయకులు వెన్నబోయిన సాంబశివరావు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, జిల్లా ఉపాధ్యక్షులు వనం నాగయ్య, మందుల ఉపేందర్, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యలమందల జగదీష్, కార్యదర్శి కర్రిషా అశోక్, మీడియా ఇంచార్జ్ తిరుపతిరావు,నాయకులు పోన్నె బోయిన పానకాలరావు, ఉల్లోజు రమేష్, నల్లమోతు శ్రీనివాస్, మోహన్ ,సాయి, వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button