PoliticalTelangana

మద్యం దుకాణాలపై మహిళల దాడులు

మద్యం దుకాణాలపై మహిళల దాడులు

మద్యం దుకాణాలపై మహిళల దాడులు

ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలో పల్సి(బీ), కోసాయి గ్రామాల్లో బెల్ట్‌ షాపులు, కల్లు బట్టీలపై మహిళలు దాడి చేశారు. అక్రమంగా విక్రయిస్తున్న మద్యం, దేశీదారు, కల్తీ కల్లు బాటిళ్లను ధ్వంసం చేశారు.ఈ సందర్భంగా మహిళలు తమ ఆవేదనను వెల్లగక్కారు.

ఇప్పటికే నీళ్లు అందక పంటలన్నీ ఎండిపోయి పెట్టుబడికి తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని సతమవుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో గ్రామాల్లోని యువకులు, రైతులు మద్యానికి బానిసలు అవుతుండటంతో కుటుంబాలు వీధిన పడుతున్నాయని వాపోయారు. విచ్చల విడిగా బెల్ట్‌షాపులను నిర్వహించడంతో ఈ పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ బెల్ట్‌షాపులు నిర్వహిస్తే ఇళ్లపై సైతం దాడులు చేస్తామంటూ నిర్వాహకులను హెచ్చరించారు. ఇప్పటికైనా ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పందించి బెల్ట్‌ షాపులను మూసి వేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, ఆందోళన చేపట్టిన ఆదివాసీ మహిళలను పలు ప్రజా సంఘాల నాయకులు అభినందించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button