
పగిడేరు వద్ద రోడ్డు ప్రమాదం
– ఏన్కూర్కు చెందిన యువకుడు మృతి
సికే న్యూస్ ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఏన్కూరు మార్చి 01 2026: మండల పరిధిలోని ఆరికాయలపాడు గ్రామానికి చెందిన వీఆర్ఏ షేక్ పాషా అల్లుడు షేక్ అక్బర్ (పాత ఇనుము వ్యాపారి) రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… రాత్రి సుమారు 8:30 గంటల సమయంలో షేక్ అక్బర్ ఏన్కూర్ నుండి లాలాపురంలోని తన నివాసానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, పగిడేరు గ్రామ పరిధిలోని కోల్డ్ స్టోరేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అక్బర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే స్పందించి ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని లాలాపురానికి తరలించే అవకాశం ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
అందర్నీ పలకరించే మంచి మనసున్న వ్యక్తిగా పేరుగాంచిన అక్బర్ ఆకస్మిక మరణం కుటుంబ సభ్యులతో పాటు గ్రామ ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మృతి కుటుంబానికి తీరని లోటును మిగిల్చగా, చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.




