
మిస్సింగ్ అయిన ముగ్గురు పిల్లలు దారుణ హ*త్య…
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ముగ్గురు చిన్నారుల మిస్సింగ్ కేసు తీవ్ర విషాదాన్ని నింపింది. శనివారం ఉదయం నుంచి కనిపించకుండా పోయిన ముగ్గురు చిన్నారులు కామారెడ్డి పెద్ద చెరువులో రాత్రి 9 గంటల తర్వాత విగతా జీవులుగా లభ్యం కావడంతో విషాదం నెలకొంది.
కామారెడ్డి పట్టణంలోని ఆర్ బి నగర్ కాలనీకి చెందిన సీపత్ (8), ఆయాత్ (7), మరియం (5) అనే ముగ్గురు చిన్నారులు అదృశ్యమైనట్లు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. కాగా విచారణ జరిపిన పోలీసులు కామారెడ్డి పెద్ద చెరువులో ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఆయాత్, మరియం మృతదేహాలు లభ్యం కాగా సీపత్ మృతదేహం అర్థరాత్రి 12:30గంటలకు చెరువులో లభ్యం అయింది. కాగా, కన్న తండ్రే ఆ చిన్నారులని చంపి చెరువులో మృతదేహాలను పడేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ మేరకు పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తల్లి పలువురి ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటుండగా తండ్రి ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నట్లు తెలిసింది.
మరోవైపు తండ్రికి అప్పుడప్పుడు మతిమరుపు ఉంటుందని తల్లి పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నట్లు సమాచారం.




