
బ్యాంకులో గుండెపోటుతో రిటైర్డ్ ఉద్యోగి మృ*తి
కొన్నిరోజులుగా గుండెపోటు ఘటనలు అందర్ని టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏంజరుగుతుందో ఎవరు చెప్పలేదు. అప్పటి వరకు బాగానే ఉన్న వాళ్లు కాస్త కుప్పకూలీపోతున్నారు. ఒకప్పుడు పెద్దవారు వయసు 50 దాటిన వారిలో హర్ట్ ఎటాక్ లు కన్పించేవి.
కానీ ఇప్పుడు మాత్రం చిన్న పిల్లలు కూడా గుండె పోటుకు గురౌతున్నారు. అన్ని వయసుల వారుఇటీవల అనుకొని విధంగా హర్ట్ స్ట్రోక్లకు గురౌతున్నారు. అప్పటి వరకు బాగానే ఉన్న వారు, నవ్వుకుంటూ ఉన్నవారు, పనులు చేస్తున్న వారు కుప్పకూలీపోతున్నారు.
జిమ్ లు చేస్తున్న వారు సైతం అకస్మాత్తుగా చనిపోయిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. హైదరాబాద్ లోని హబ్సీగూడలో పెను విషాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ హబ్సిగూడలో విషాద ఘటన చోటుచేసుకుంది.
నాచారం ప్రాంతానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మీనారాయణ (వృద్ధుడు) బుధవారం పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు డబ్బులు డిపాజిట్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో బ్యాంకులో డిపాజిట్ స్లిప్‌లో వివరాలు రాస్తున్నారు. ఇంతలో ఏదో అసౌకర్యంకు గురయ్యారు.
ఆ తర్వాత వెంటనే పక్కనే ఉన్న చెర్ మీద వాలిపోయి అకస్మాత్తుగా కిందపడిపోయారు. హార్ట్ అటాక్ రావడంతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను బ్యాంక్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు.
కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తమతో బాగానే మాట్లాడారని బ్యాంక్ సిబ్బంది చెప్పారు. కానీ ఇంతలోనే ఈ విధంగా జరగటంతో సిబ్బంది సైతం ఎమోషనల్ అయ్యారు. ఈ విషాద ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.




