
మంగ్లీ వివాదంలో కీలక పరిణామం.. ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ సజ్జనార్‌ను కలిసిన సింగర్..
గత కొన్నిరోజులుగా అడ్వకేట్ సుబ్బారావు తన ప్రతిష్టను దిగజార్చేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్‌కు ప్రముఖ సింగర్ మంగ్లీ మంగళవారం ఫిర్యాదు చేశారు.
మంగ్లీ, ఆమె సోదరుడు ఫెనాన్స్ చీటింగ్‌కు పాల్పడుతున్నారంటూ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టగా, దానికి కౌంటర్‌గా మంగ్లీ కూడా ఆయనపై ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.
అయితే, ఉద్దేశపూర్వకంగా తనను ఈ వివాదంలోకి లాగడమే కాకుండా, ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నారని, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తనపై ఉన్న అపవాదు వీడియోలను తొలగించాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని సుబ్బారావు డిమాండ్ చేస్తున్నారని ఆమె సీపీకి వివరించారు.
అడ్వకేట్ సుబ్బారావుతో పాటు సోషల్ మీడియాలో తనపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, తన పరువు తీస్తున్న ఆ వీడియోలను ఇంటర్నెట్ నుంచి తొలగించేలా ఆదేశించాలనికోరారు.




