
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వ్యక్తి మృతి…
న్యాయం చేయాలంటూ బంధువుల ఆందోళన…
ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో దారుణం చోటుచేసుకుంది. కామినేని హాస్పిటల్ లో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల నరేష్ అనే వ్యక్తి మృతి చెందాడు.
వివరాలలోకి వెళితే..పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంకు చెందిన నరేష్ (38) అనే వ్యక్తి నారాయణ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తాడు. గుండెలో చిన్న నొప్పి ఉందని నడుచుకుంటూ హాస్పిటల్ కి వచ్చాడు.
పరీక్షించిన వైద్యులు 8 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. 5 లక్షలు రూపాయలు ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకొని ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆపరేషన్ చేశాక నరేష్ మృతి చెందాడు.
జూనియర్ డాక్టర్లతో ఆపరేషన్ చేశారని, మాకు న్యాయం చేయాలంటూ కామినేని హాస్పిటల్ ముందు మృతుడి బందువులు ఆందోళన చేపట్టారు. నారాయణ కాలేజీ లెక్చరర్స్ కలసి కామినేని ఆసుపత్రి ముందు న్యాయం మృతిని కుటుంబానికి న్యాయం చేయాలని ధర్నా..
మా నారాయణ లెక్చరర్స్ మృతి కి కామినేని ఆసుపత్రి వైద్యులు కారణమని వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి కదిలేది లేదని కామినేని డౌన్ కామినేని డౌన్ తోటి ఉద్యోగులు. నినాదాలు చేశారు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




