KarimnagarPoliticalTelangana

50వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్‌ ఏఈ

50వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్‌ ఏఈ

50వేలు లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మున్సిపల్‌ ఏఈ

హుజూరాబాద్‌ మున్సిపల్‌ ఏఈ నుసుం సుధాకర్‌రెడ్డి..
కనీసం ప్రొబేషనరీ కూడా పూర్తికాలేదు. అప్పుడే రూ.50వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. బాధితుడు, ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. హుజూరాబాద్‌లోని వరంగల్‌ రోడ్‌ వైపు రూ.15లక్షలతో డ్రైనేజీ పనులను కాంట్రాక్టర్‌ సంతోష్‌ చేపడుతున్నాడు.

మొదటి బిల్లు కింద రూ.4లక్షల వచ్చాయి. మరో రూ.14లక్షల బిల్లుకు ఎంబీ రికార్డు చేయాల్సి ఉంది. దీనికి ఏఈ సుధాకర్‌రెడ్డిని సంప్రదించగా రూ.50వేలు లంచం డిమాండ్‌ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని కాంట్రాక్టర్‌ చెప్పినా ససేమిరా అన్నాడు.

దీంతో కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను సంప్రదించాడు. వారి సూచన మేరకు బుధవారం రూ.50వేలు ఇస్తానని సుధాకర్‌రెడ్డికి చెప్పగా.. వరంగల్‌ రోడ్‌లోని ఓ మటన్‌ షాపు వెనుక తీసుకునేందుకు ఒప్పుకున్నాడు. పథకం ప్రకారం..

ఏసీబీ కరీంనగర్‌ డీఎస్పీ విజయ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో అధికారులు సుధాకర్‌రెడ్డిని డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. విచారణ చేపట్టగా నేరం అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు ఏసీబీ సీఐ చందర్‌ తెలిపారు.

అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఇందులో అనేక విషయాలు బయటపడినట్లు సమాచారం. నిందితుడిని గురువారం కోర్టులో హాజరు పరుస్తామని డీఎస్పీ విజయ్‌కుమార్‌ తెలిపారు.

అధికారులెవరైనా లంచం డిమాండ్‌ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. 1064 టోల్‌ ఫ్రీ నంబర్‌లోనైనా.. లేదా 9440446106 నంబర్‌కు వాట్సాప్‌ ద్వారా తెలియజేయవచ్చని సూచించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button