
మంగ్లీ కేసులో బిగ్ ట్విస్ట్…కీలక నిందితుడు అరెస్ట్
సింగర్ మంగ్లీకి సంబంధం ఉందని ప్రచారం సాగుతున్న మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ అప్డేట్ నెలకొంది. కీలక నిందితుడు మధు అరెస్టు అయ్యారు.
మియాపూర్ పోలీసులు మధును అదుపులోకి తీసుకున్నారు. రమావత్ మధు అరెస్టు కావడంతో కీలక విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
మంగ్లీ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొంటున్నాయి. మంగ్లీ విషయంలో మధు, హిమకాంత్ రెడ్డి పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. మంగ్లీని చూసే పెట్టుబడులు పెట్టామని హిమకాంత్ రెడ్డి అంటుండగా.
అసలు మంగ్లీకి ఈ కేసుతో సంబంధమే లేదని మధు పేర్కొనడం గమనార్హం. ఈ సందర్భంగా మధు ఒక వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా మరో కొత్త వీడియోను మధు రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ హిమకాంత్ రెడ్డిని తనకు గురువుగా పేర్కొనడం విశేషం. ఇక — సరిత బాధితురాలు కాదన్న ఆయన హిమకాంత్, సరిత, సుబ్బు..ప్రజలను పిచ్చొళ్లను చేస్తున్నారని వెల్లడించారు.
తానెక్కడికి పారిపోలేదన్న మధు త్వరలోనే మీడియా ముందుకు వస్తా నని వెల్లడించారు. ఒక్కొక్కడి బండారం బయటపెడతానని తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. హిమకాంత్ మాట నమ్మి నేను మోసపోయానని మధు పేర్కొన్నారు.
సరితను అరెస్టు చేసి అడిగితే..అసలు విషయాలు బయటపడతాయని మదు స్పష్టం చేశారు. తనకే పాపం తెలియదని మంగ్లీ చెప్పడమే కాకుండా మధు నన్ను కలిసింది నిజమే కానీ, అతని బిజినెస్ కు సంబంధించిన నాకేం తెలీదు అని మంగ్లీ పేర్కొనడం గమనార్హం.
కాగా కుంభకోణం వెనుక అసలు వ్యక్తులు హిమాకాంత్ రెడ్డి అని మధు ఆరోపిస్తున్నారు. హిమాకాంత్ రెడ్డి ఏకంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడని మధు వెల్లడించారు.
అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి మంచి స్నేహితులని.. హిమాకాంత్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని మధు పేర్కొన్నారు.
నేను కూడా బాధితురాలినే.. సింగర్ మంగ్లీ ఆవేదన
టాలీవుడ్ సింగర్ మంగ్లీ మరోసారి తన ఆవేదన వ్యక్తం చేశారు. నాపై ఇప్పటికీ బురద జల్లడం ఆగడం లేదన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోలీసులకు సహకరిస్తానని అన్నారు.
చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదని.. భవిష్యత్తులో చేయదు కూడా అని వెల్లడించారు.
మధునాయక్‌ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో భాగంగా నన్ను, నా తమ్ముడిని కలిసిన మాట వాస్తవమేనని.. కానీ అతని వ్యాపారాల గురించి తనకు తెలియదన్నారు.
ఈ కేసు విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే అడ్వకేట్ సుబ్బారావుతో పాటు రమావత్ మధుపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపింది. తప్పు చేసిన రమావత్ మధు అండ్ గ్యాంగ్‌పై తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేసింది.
ఈ కేసులో మోసగాళ్లను, బాధితులను అంశాలను పక్కనపెట్టి.. నాపై నా కుటుంబంపై కొందరు వ్యక్తులు కావాలనే ఈ వివాదంలోకి నన్ను లాగుతున్నారని మంగ్లీ తన బాధను వ్యక్తం చేసింది.
మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు ఇంతకు ముందెప్పుడూ తెలియదని మంగ్లీ తెలిపింది. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశానని అభియోగం రావడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసిందని వెల్లడించింది.
నేను కూడా మైక్రో ఫైనాన్స్ బాధితురాలినేనని.. వాళ్లు అమాయకులు డబ్బులు పోగొట్టుకుంటే.. నేను నా పేరు పోగొట్టుకుంటున్నానని మంగ్లీ ఆవేదన వ్యక్తం చేసింది.



