
యువతి ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
Web desc : చెరువులో ఆత్మహత్య చేసుకునేందుకు వెళుతున్న యువతిని పోలీసులు కాపాడారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. కల్వకుర్తికి చెందిన ఓ యువతి (20) పటాన్‌చెరువులో ఉద్యోగం చేస్తూ కేపీహెచ్‌బీ కాలనీలోని షణ్ముఖ హాస్టల్‌లో ఉంటోంది.
వ్యక్తిగత సమస్యల కారణంగా మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవాలకుంది. దీంతో ఆదివారం కూకట్‌పల్లి ఐడియల్ చెరువులోకి దిగింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చెరువు వద్దకు చేరుకున్నారు.
ఎస్‌ఐ చంద్రశేఖర్, దీక్షిత, వెంకటప్పలు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చెరువులోకి దూకి వెళ్లి యువతిని కాపాడి బయటకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎస్‌ఐ కాలికి గాయాలయ్యాయి.
అనంతరం యువతిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి కౌన్సిలింగ్ ఇప్పించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించడానికి ఇష్టపడటం లేదని పోలీసులు తెలిపారు.



