Uncategorized

నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక

నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక

నంది అవార్డుకు జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ ఎంపిక

-సంచలనాత్మక కథనాలకు కేరాఫ్..

-నాడు డాక్టరేట్.. నేడు నంది అవార్డు..

–వెల్లువెత్తుతున్న అభినందనలు..

సికే న్యూస్ ప్రతినిధి

ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ బండి కుమార్ ఆనందో బ్రహ్మ స్వర్ణనంది పురస్కారం అవార్డుకి ఎంపికయ్యారు. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ గత 12 సంవత్సరాలుగా వివిధ ఛానెల్స్, పత్రికల్లో, వివిధ హెదాల్లో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. అనేక అంశాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ప్రజా సమస్యలను వెలికి తీస్తూ ప్రభుత్వాల ద్వారా వాటిని పరిష్కరించేందుకు విశేషంగా కృషి చేస్తున్నారు.

ఈవిధంగా సమాజానికి సేవచేస్తూ సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నందుకు అతని సేవలను గుర్తించి ఈ నెల మే 3వ తేదీన ఆదివారం రోజున హైదరాబాద్ రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్ లో జరిగే ఆనందో బ్రహ్మ స్వర్ణ నంది పురస్కారం కార్యక్రమంలో మాజీ కార్మిక శాఖ మంత్రి, ప్రముఖ హాస్యనటుడు, డాక్టర్ పల్లి బాబు మోహన్, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ నాయుడు సత్యనారాయణ చేతుల మీదుగా ప్రధానం చేస్తున్నారు. సీనియర్ జర్నలిస్టు డాక్టర్ బండి కుమార్ “పీపుల్స్ డైరీ” దినపత్రిక ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిథిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక సంచలనాత్మక కథనాలను అందించారు. ఎక్కడ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నా ఎలాంటి శక్తుల ఒత్తిళ్లకు లొంగకుండా నిర్భయంగా వార్తలు అందించడంలో దిట్ట… జర్నలిజం వృత్తినే శ్వాసగా… నైతిక విలువలను పాటిస్తూ పేదల పక్షాన నిలువడం, అన్యాయాన్ని ఎదురించడం లక్షణం.. అక్రమార్కుల బెదిరింపులకు వెరువకుండా, అక్రమ కేసులకు సైతం భయపడకుండా ఎంచుకున్న దారిలో దూసుకెళ్తూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎందరో జర్నలిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. నంది అవార్డు రావడం పట్ల స్థానిక సీనియర్ జర్నలిస్టులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు అభినందనలు తెలుపుతూ డాక్టర్ బండి కుమార్ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button