
మిషన్ భగీరథ నీటి వృధా… పట్టించుకునే వాళ్లే లేరు.
సి కే న్యూస్ చింతకాని ప్రతినిధి.
చింతకాని. రామకృష్ణ పురం గ్రామ పంచాయితీ ఆఫీసు ముందు ఉన్న హాస్పిటల్లో గాంధీ నగర్,బొప్పారం గ్రామాల ప్రజల దాహార్తిని తీర్చేందుకు నిర్మించిన వాటర్ ట్యాంక్ నుంచి నీరు వృథాగా పోతున్న పట్టించుకునే వాళ్ళు లేక నీళ్ళు సైడ్ కాలువ ద్వారా వృధా గా బయటకు వెశ్తున్నాయి, వారంలో ఒకసారైనా ఈ విధంగా నీరు వృథాగా పోవటం పరిపాటైపోయింది, సుమారు 2 గంటల నుంచి ఈ విధంగా నీరు బయటకు వెళ్తున్నట్టు చూసిన వాళ్ళు చెప్పుతున్నారు. గ్రామ పంచాయతీ ఆఫీస్ బజార్లో ఉన్న కొంతమంది చిన్న పిల్లలు వేసవి తాపాన్ని తట్టుకోలేక ట్యాంక్ నిండి వృధా గా బయటకు పోయే నీళ్లలో ఎంజాయ్ చేస్తున్నారు.



