Telangana

మాగనూర్​ ఘటనపై సీఎం సీరియస్​

మాగనూర్​ ఘటనపై సీఎం సీరియస్​

మాగనూర్​ ఘటనపై సీఎం సీరియస్​

నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు.

ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు.

ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button