HyderabadPoliticalTelangana

అర్ధరాత్రి అమ్మాయికి కాల్ చేసిన కానిస్టేబుల్ అనుమానాస్పద మృ*తి

అర్ధరాత్రి అమ్మాయికి కాల్ చేసిన కానిస్టేబుల్ అనుమానాస్పద మృ*తి

అర్ధరాత్రి అమ్మాయికి కాల్ చేసిన కానిస్టేబుల్ అనుమానాస్పద మృ*తి

Web desc : మలక్‌పేట్‌లో పోలీస్ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మూసారాంబాగ్ శాలివాహన నగర్‌లో ఈ ఘటన జరిగింది. 35 ఏళ్ల కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో కానిస్టేబుల్ రైటర్‌గా చంద్రశేఖర్ విధుల్లో ఉన్నాడు.

అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తాను ఉరేసుకుంటున్నట్లు సదరు యువతికి కానిస్టేబుల్ చెప్పాడు. వెంటనే.. చైతన్యపురి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. చైతన్యపురి పోలీసుల సమాచారంతో మలక్‌పేట్ పోలీసులు స్పాట్కు చేరుకున్నారు.

మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ మృతికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటు చేసుకుంది. మూసారాంబాగ్ లోని శాలివాహన నగర్ పార్క్ సమీపంలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ చంద్రశేఖర్ మృతి చెందారు. మృతుడు ముథే చంద్రశేఖర్ (35), ARPC No.11729, 2020 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ గా అంబర్ పేట SCRCPL, మల్కాజిగిరి కమిషనరేట్ లో రైటర్ గా విధులు నిర్వహిస్తున్నారు.

అతని స్వస్థలం బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా, బుధాఖుర్ద్. ఆదివారం అర్ధరాత్రి 12:20 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు మలక్ పేట పోలీసులు తెలిపారు. ప్రేమ వ్యవహారం కారణంగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

దిల్ సుఖ్ నగర్లో కోచింగ్ తీసుకుంటున్న స్వాతి అనే యువతితో నిశ్చితార్థం జరిగినట్లు, అయితే యువతికి మరో వ్యక్తితో సంబంధం ఉందనే విషయంపై ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి యువతికి వీడియో కాల్ చేసి మాట్లాడిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. యువతి ఇచ్చిన సమాచారంతో చైతన్యపురి పోలీసుల ద్వారా మలక్ పేట పోలీసులకు సమాచారం అందింది.

పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునే సరికి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుని తల్లిదండ్రులు సింగరేణి ఉద్యోగులుగా రిటైర్ అయ్యారని, నలుగురు అక్కలు ఉన్నారని, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు లేవని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మలక్ పేట పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button