NationalPolitical

తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య

తుపాకీతో కాల్చుకుని మహిళ ఆత్మహత్య

Web desc : ఇంట్లో రివాల్వర్‌తో కాల్చుకుని మహిళ అనుమానాస్పద రీతిలో చనిపోయిన ఘటన కర్నాటక చిక్కమగళూరు నగరంలోని హాళేనహళ్లిలో జరిగింది.

వ్యాపారవేత్త రాజేంద్ర భార్య సుమ (55) గృహిణి. బుధవారం ఇంట్లో లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌తో ఆమె కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనకు ముందు డెత్‌నోట్‌ రాసి పెట్టారు.

ఘటన జరిగిన సమయంలో ఆమె భర్త బయటకు వెళ్లాడు, కుమారుడు ఇంట్లోనే ఉన్నాడు. తుపాకీ కాల్పుల శబ్ధాలు విని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. వచ్చి చూసేసరికి ఆమె రక్తపు మడుగులో చనిపోయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button