HealthHyderabadNotificationPoliticalTelangana

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల దూకుడు.. త్వరలో మరిన్ని ఉద్యోగాలు.,.

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల దూకుడు.. త్వరలో మరిన్ని ఉద్యోగాలు.,.

వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల దూకుడు.. త్వరలో మరిన్ని ఉద్యోగాలు.,.

Web desc : తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో నియామకాల దూకుడు కొనసాగుతుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరతను తీర్చి, వైద్య విద్యా ప్రమాణాలను ఉన్నత స్థాయికి తీసుకు వెళ్ళటంతో పాటు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వైద్య-ఆరోగ్య శాఖలో నిరంతర నియామకాలు చేపట్టింది. ఈ క్రమంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మరో కీలక మైలురాయిని సాధించింది.

433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ

డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 30 స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ డిపార్ట్‌మెంట్లలోని 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను బోర్డు విజయవంతంగా భర్తీ చేసింది. తాజాగా ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను బోర్డు అధికారికంగా విడుదల చేసింది. ఇందులో 4 స్పీచ్ పాథాలజిస్ట్ పోస్టుల సెలక్షన్ జాబితా కూడా ఉంది.

607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ

గతంలో బోర్డు 34 విభాగాలకు చెందిన మొత్తం 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో అనస్తీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ వంటి ముఖ్య విభాగాల్లోని 174 పోస్టుల భర్తీ ఇప్పటికే పూర్తయింది. ఆ ఎంపికైన డాక్టర్లకు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇటీవల నియామక పత్రాలు అందజేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button