PoliticalsuryapetaTelangana

భర్త ఫోన్ ఎత్తడం లేదని.. మహిళ ఆత్మహత్య..

భర్త ఫోన్ ఎత్తడం లేదని.. మహిళ ఆత్మహత్య..

భర్త ఫోన్ ఎత్తడం లేదని.. మహిళ ఆత్మహత్య..

సూర్యాపేట జిల్లా వల్లాపురం గ్రామంలో ఘటన

Web desc : భర్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు యత్నించిన మహిళ ట్రీట్ మెంట్ తీసుకుంటూ చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామంలో జరిగింది.

ఎస్సై అజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… ఖమ్మం జిల్లా నేలకొండపల్లి గ్రామానికి చెందిన స్వాతి (21)కి రెండేండ్ల కింద నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన సారగండ్ల కోటేశ్వరరావుతో వివాహమైంది.

కోటేశ్వరరావు జేసీబీ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న కోటేశ్వరరావు పనికి వెళ్లిన టైంలో స్వాతి ఫోన్ చేయగా.. ఆయన లిఫ్ట్ చేయలేదు. దీంతో మనస్తాపానికి గురైన స్వాతి ఉరి వేసుకుంది.

గమనించిన కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా.. అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం రాత్రి చనిపోయింది. మృతురాలి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button