AdilabadPoliticalTelangana

రణ దివ్యానగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

రణ దివ్యానగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

రణ దివ్యానగర్‌లో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

150 మంది పోలీసు సిబ్బందితో తెల్లవారుజామున విస్తృత తనిఖీలు

తనిఖీలలో 107 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారు, నాలుగు ట్రాక్టర్లు, 10 మద్యం క్వార్టర్ బాటిల్స్ లభ్యం.

16 నంబర్ ప్లేట్ లేని వాహనాలు స్వాధీనం

గంజాయి, పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, చట్టవ్యతిరేక కార్యకలాపాలపై హెచ్చరిక

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్

జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజల్లో భద్రతాభావం పెంపొందించడం, నేరాల నియంత్రణ, ప్రజలతో పోలీసుల అనుసంధానాన్ని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా రణ దివ్యానగర్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని బుధవారం తెల్లవారుజామున నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 107 ద్విచక్ర వాహనాలు, 16 ఆటోలు, ఒక కారు, నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్ లేకుండా సంచరిస్తున్న 16 వాహనాలను స్వాధీనం చేసుకొని, (BNS) సెక్షన్ 318(4) ప్రకారం చీటింగ్ కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు మత సామరస్యాన్ని కాపాడాలని, సామాజిక మాధ్యమాలు లేదా బహిరంగ ప్రదేశాల్లో గొడవలకు, విద్వేషాలకు దారితీసేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. ఎక్కడైనా వివాదాస్పద పరిస్థితులు తలెత్తినప్పుడు వాటిలో జోక్యం చేసుకోకుండా వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు.

ప్రభుత్వ రాయితీ (PDS) బియ్యాన్ని కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, విక్రయించడం లేదా అక్రమంగా తరలించడం నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే జిల్లాలో రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని చట్టాన్ని గౌరవించేలా జీవించాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ప్రత్యేక తనిఖీల్లో భాగంగా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న కాంబ్లే సుభాష్ వద్ద నుంచి 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, రూరల్ సీఐ రహీం పాషా, సీఐలు బి.డి. ప్రేమ్ కుమార్, ప్రణయ్ కుమార్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎస్సైలు వి. విష్ణువర్ధన్, ఎస్. జీవన్ రెడ్డి, విష్ణు ప్రకాష్, హారుణ్తో పాటు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button