HealthNalgondaPoliticalTelangana

లింగ నిర్ధారణ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ముఠా!

లింగ నిర్ధారణ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ముఠా!

లింగ నిర్ధారణ చేస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ ముఠా!

web desc : నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గర్భస్థ లింగ నిర్ధారణ పరీక్షల దందాను పోలీసులు భగ్నం చేశారు. శివాజీ నగర్‌లోని ఒక ఇంట్లో ఈ అక్రమ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారంతో నకిరేకల్ పోలీసులు మెరుపుదాడి చేశారు.

ఈ దాడుల్లో ప్రధాన నిందితులు బట్కా యాదగిరి, టేకుమట్ల జానయ్యలను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ​పోలీసుల కథనం ప్రకారం.. కేసారం, కట్టంగూరు ప్రాంతాలకు చెందిన కొందరు ఆర్ఎంపీల సహకారంతో ఈ ముఠా దందా సాగిస్తోంది.

ఆర్ఎంపీల ద్వారా గర్భిణీలను నకిరేకల్‌కు రప్పించి, ఇక్కడి ఓ ఇంట్లో రహస్యంగా స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిందితులిద్దరికీ గతంలోనూ ఇలాంటి నేర చరిత్ర ఉంది. చివ్వెంల మండలంలో జరిగిన ఒక గర్భిణి మరణం కేసులో కూడా వీరిద్దరూ నిందితులుగా ఉండి, జైలుకు వెళ్లి వచ్చారు. అయినప్పటికీ వారి తీరు మారకపోవడం గమనార్హం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button