PoliticalTelanganaWarangal

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు

వైఎస్‌ఆర్‌ జయంతి సందర్భంగా ఘన నివాళులు

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి నివాళులర్పణ

ప్రజా సంక్షేమమే వైఎస్‌ఆర్‌ ఆశయమని వ్యాఖ్య : ఎమ్మెల్యే

పాలకుర్తి(ck న్యూస్)ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొని వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమమే లక్ష్యంగా అనేక ప్రజాహిత పథకాలను అమలు చేసిన మహానేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వాములై సేవ చేయాలనే వైఎస్‌ఆర్‌ ఆశయాలను ప్రతి ప్రజాప్రతినిధి ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఘన నివాళులర్పించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button