
పేదల నాయకుడు వై,ఎస్ కు ఘన నివాళులు
చిత్రపటానికి పూలమాల.. కేక్ కట్ చేసిన నాయకులు
పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్ల పంపిణీ
పాలకుర్తి/తొర్రూరు(ck న్యూస్) ప్రతినిధి పల్లె దేవేందర్ గౌడ్ : దివంగత ముఖ్యమంత్రి వై, ఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను తొర్రూరు పట్టణంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. తొర్రూరు మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు సుంచు సంతోష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అనుమాండ్ల తిరుపతి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి, పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పరామర్శించారు.
ఈ సందర్భంగా అనుమాండ్ల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ… వైఎస్సార్ పేదల సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన ప్రజానాయకుడని అన్నారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుపేదల కోసం ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
విశిష్ట అతిథిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకుడు రామసహాయం కృష్ణ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి సేవలందించిన మహోన్నత నాయకుడని పేర్కొన్నారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల హృదయాల్లో నిలిచాయని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సేవా దృక్పథంతో ప్రజలకు చేరువ కావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు మెరుగు మల్లేశం గౌడ్, మండల నాయకులు అనుమాండ్ల నరేందర్ రెడ్డి, దేవరకొండ శ్రీనివాస్, బిజ్జాల వరప్రసాద్, మాజీ సర్పంచ్ తమ్మడపల్లి సంపత్, రావుల అనిల్ రెడ్డి, మడిపెల్లి ఉపసర్పంచ్ ఉపేందర్ రెడ్డి, చర్లపాలెం ఉపసర్పంచ్ జినుగా రవీందర్ రెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డు సభ్యులు, యువజన నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




