PoliticalTelangana

బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…

బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…

బండి సంజయ్ కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం…

కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కాన్వాయ్‌కు సిరిసిల్ల జిల్లాలో స్వల్ప ప్రమాదం జరిగింది. కాన్వాయ్‌లోని వాహనాలు వరుసగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.

జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని హరిదాస్ నగర్ గ్రామం నుంచి బండి సంజయ్ తన కాన్వాయ్‌తో గంభీరావుపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో, వెనుక వస్తున్న కాన్వాయ్ కార్లు ఒకదానికొకటి వెనుక నుంచి బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు కాన్వాయ్‌లోని వాహనాల ముందు, వెనుక భాగాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.

అయితే, అదృష్టవశాత్తూ బండి సంజయ్‌తో పాటు వాహనాల్లో ఉన్న నాయకులకు, భద్రతా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో తృటిలో పెద్ద ముప్పు తప్పినట్లయింది. ప్రమాదం జరిగిన వెంటనే అంతా ఒక్కాసారిగా పీల్చుకున్నారు. అనంతరం బండి సంజయ్ మరో వాహనంలో తన తదుపరి పర్యటనకు బయలుదేరి వెళ్లారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button