
ఏదుల మండలానికి నూతన తహసీల్దార్ కార్యాలయ భవనం మంజూరు
రూ.2.25 కోట్లతో నిర్మాణానికి పరిపాలనా అనుమతి
ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హర్షం
సీకే న్యూస్ ప్రతినిధి, వనపర్తి జిల్లా
వనపర్తి నియోజకవర్గంలోని ఏదుల మండలానికి తెలంగాణ ప్రభుత్వం నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. ప్రస్తుతం అద్దె భవనం/శిథిలావస్థలో కొనసాగుతున్న కార్యాలయానికి శాశ్వత భవనం నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీ చేసింది.
ఈ మేరకు రూ.2.25 కోట్లతో తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి G.O.Rt.No.428 ప్రకారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఏదుల మండల ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. నూతన భవనం నిర్మాణం పూర్తయిన అనంతరం ప్రజలకు ఒకే చోట మరింత మెరుగైన ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ అభివృద్ధి పనులకు సహకరించిన ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి, రెవెన్యూ శాఖ మంత్రికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.




