
రేషన్ డీలర్ల సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘన ప్రారంభం…
సీ కె న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,
జూలై 29:
తెలంగాణ రాష్ట్ర ఆథరైజ్డ్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రమేష్ బాబు, రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు ఊకె శేఖర్ బుధవారం భద్రాచలం మండలంలో ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదును విస్తృతంగా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రేషన్ డీలర్ల సంక్షేమం, సంఘం బలోపేతమే లక్ష్యంగా ప్రతి రేషన్ డీలర్ సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, డివిజన్, మండలాల ఆథరైజ్డ్ రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు, రేషన్ డీలర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు భూక్యా సందీప్‌తో పాటు భూక్యా లక్ష్మణ్, జీ. రమేష్, ఎస్. రాంబాబు, వి. వీరయ్య, భూక్యా సాయి కౌశిక్, కె. రమాదేవి, పి. సరోజిని తదితరులు పాల్గొన్నారు.




