
గ్రామసభ అనంతరం సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నం..
Web desc : గ్రామ సభ అనంతరం సర్పంచ్ భర్త ఆత్మహత్యకు పాల్పడటం కరీంనగర్ జిల్లాలో కలకలం రేపింది. గ్రామసభ అనంతరం పరుగు పరుగున ఇంటికి వెళ్లి.. ఇంట్లో ఉన్న మాత్రలు అధిక మోతాదులో వేసుకోవడం టెన్షన్ కు గురిచేసింది.
జిల్లాలోని గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో బుధవారం (ఆగస్టు 05) జరిగింది ఈ ఘటన. వివరాల్లోకి వెళ్తే.. నారాయణపూర్ సర్పంచ్ దీకొండ లక్ష్మి భర్త దీకొండ మధు ఆత్మ హత్య యత్నానికి పాల్పడ్డారు. గ్రామ సభ అనంతరం మాత్రలు మింగటంతో వెంటనే కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
నారాయణపూర్ ముంపు గ్రామం విషయంలో సర్పంచి భర్తపై గ్రామస్తులు తప్పుడు ప్రచారాలు చేయడం వల్లే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
గ్రామ వాట్స్ ఆప్ గ్రూప్ లలో సర్పంచ్ పై విమర్శలు చేస్తున్నారని ఆవేదనతోనే సూసైడ్ అంటెంప్ట్ చేసినట్లు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.




