PoliticalTelangana

రెస్టారెంట్ మేనేజర్‌పై దుండగుల దాడి

రెస్టారెంట్ మేనేజర్‌పై దుండగుల దాడి

రెస్టారెంట్ మేనేజర్‌పై దుండగుల దాడి

web desc : చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని సాద్వి రెస్టారెంట్ లోకి ఐదుగురు వ్యక్తులు వచ్చి మద్యం తీసుకొని రమ్మని చెప్పడంతో సాద్వి రెస్టారెంట్ మేనేజర్ సుదర్శన్ ఇందులో మద్యం పర్మిషన్ లేదు మేము తీసుకురాలేము అని చెప్పడంతో ఎందుకు తీసుకురావు అని బూతు మాటలు తిడుతూ అతనిపై దాడి చేయడం జరిగింది.

అతనిపై దాడి చేస్తున్న క్రమంలో అందులో పనిచేస్తున్న వ్యక్తులు వచ్చి అడ్డుకోగా వారిపై కూడా దాడి చేశారు అందులో ఒక మహిళ కూడా ఉంది తనను కట్టెలతో కొట్టి తన్నారని ఆ మహిళ చెపుతుంది. దాడి చేస్తూ బూతులు తిడుతూ మేము పోలీసులం చంపేస్తాం ఏం పీక్కుంటావో పీక్కో అనే బూతులు తిట్టారని సుదర్శన్ తెలిపారు.

ఇలాంటి ఘటనను సహించేది లేదని తనకు ఏమన్నా అయితే వాళ్ల పరిస్థితి ఏందని దాడి చేసిన వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వెంటనే చేవెళ్ల పోలీస్ స్టేషన్ కి వెళ్లి దాడి చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేయడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button