Mahabub badPoliticalTelangana

మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

మాజీ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం..

Web desc : డోర్నకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రెడ్యా నాయక్‌ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం అబ్బాయిపాలెం శివారులోని జాతీయ రహదారి 365 పై గురువారం జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఓ కార్యక్రమం నిమిత్తం కురవి వైపు వెళ్తుండగా మరిపెడ మండలం అబ్బాయిపాలెం గ్రామం వద్ద ముందు వెళ్తున్న ఓ బైక్‌ అకస్మాత్తుగా యూటర్న్‌ తీసుకోవడంతో, ఎదురుగా వస్తున్న కూలీలను తప్పించేందుకు రెడ్యా నాయక్‌ కారు డ్రైవర్‌ వాహనాన్ని నెమ్మది చేశారు.

ఈ క్రమంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో కారు, రెడ్యా నాయక్‌ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనుక భాగం దెబ్బతింది. ప్రమాదంలో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు, అనుచరులు ఊపిరి పీల్చుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button