EntertainmentHyderabadPoliticalTelangana

మరో వివాదంలో నటి అనసూయ..జై శ్రీరామ్ అంటూ !

మరో వివాదంలో నటి అనసూయ..జై శ్రీరామ్ అంటూ !

మరో వివాదంలో నటి అనసూయ..జై శ్రీరామ్ అంటూ !

web desc : మరో వివాదంలో టాలీవుడ్ నటి అనసూయ చిక్కుకున్నారు. ఇటీవల హిందూ ధర్మంపై ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో సనాతన ధర్మాన్ని అవమానించారంటూ అనసూయపై ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ వివాదంపై తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చారు అనసూయ.

జై శ్రీరామ్ అనే కొందరి విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించి.. తప్పుగా ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తాను కూడా హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వ్యక్తిని పేర్కొన్నారు. హనుమాన్ భక్తురాలిని అని కూడా చెప్పుకొచ్చారు.

అన్యాయం జరిగినప్పుడు మాట్లాడకుండా ఉండటం తన స్వభావం కాదని క్లారిటీ ఇచ్చారు. తాను మాట్లాడిన సందర్భం గురించి వదిలేసారని ఆమె వాపోయారు. తనపై నమ్మకం ఉన్నవారు ఎడిటర్ క్లిప్స్, హార్ట్ స్టేట్మెంట్స్ వలలో పడకూడదని ఆమె కోరారు. ఇక అంతకు ముందు ‘జైశ్రీరామ్‌’ అనేవాళ్లలో కొందరు పెద్ద దొంగలు ఉన్నారని అనసూయ పేర్కొన్నట్లు వీడియో వైరల్ అయింది.

ఆ నినాదం ముసుగులో దాడులు చేస్తున్నారని పేర్కొన్నారట. ఈ క్రమంలోనే అనసూయపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. హిందువులను దూషించడం ప్రతి ఒక్కరికీ.. ఫ్యాషన్‌గా మారిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ దెబ్బకు వివాదంపై మరో వీడియో రిలీజ్ చేసిన అనసూయ, క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button