HyderabadPoliticalTelangana

చిన్న నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణo బలి… రైలు ఢీకొని యువతి..

చిన్న నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణo బలి… రైలు ఢీకొని యువతి..

చిన్న నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణo బలి… రైలు ఢీకొని యువతి..

web desc : చిన్న నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బతుకుదెరువు కోసం పట్నం వచ్చిన ఓ యువతి నర్సుగా ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులను పోషిస్తోంది. ఊహించని రైలు ప్రమాదం ఆమె ప్రాణాల్ని తీసింది. హైదరాబాద్ మౌలాలి రైల్వే స్టేషన్ పరిధిలో ఈ విషాధకర సంఘటన చోటుచేసుకుంది.

20 ఏళ్ల మానేపల్లి మానస అనే యువతి వందే భారత్ రైలు ఢీకొని యువతి మృతి చెందడంతో తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. స్థానికుల్ని ఈఘటన కలచివేసింది. రైలు ఢీకొని యువతి.. త్వరగా ఇంటికి చేరాలన్న తాపత్రయం ఓ యువతి ప్రాణాలు పోయేందుకు కారణమైంది.

జనగామకు చెందిన మానేపల్లి మానస అనే 20 సంవత్సరాల యువతి హైదరాబాద్‌లో నర్సుగా జాబ్ చేస్తూ తల్లిదండ్రులను పోషించుకుంటోంది. హైదరాబాద్ -మౌలాలి హౌసింగ్ బోర్డు కాలనీలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న మానస సోమవారం మౌలాలి రైల్వే స్టేషన్‌లో గోల్కొండ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ దిగిన అనంతరం పట్టాలు దాటుతుండగా పక్కనే ఉన్న పట్టాలపై వేగంగా వస్తున్న వందే భారత్ రైలు ఢీకొట్టింది.

ఈయాక్సిడెంట్‌లో మానస అక్కడిక్కడే మృతి చెందింది. ఊహించని ఘటన.. ఉదయాన్నే ఈఘటన జరగడంతో మౌలాలి రైల్వే స్టేషన్ పరిధిలోని రైల్వే సిబ్బంది, స్థానికులు వెంటనే ఘటన స్తలానికి చేరుకొని యువతిని గుర్తించారు. విషయాన్ని పోలీసులకు చేరవేశారు.

సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొడుకులా చేతికి అందివచ్చిన కూతురు రైలు ఢీకొని మృతి చెందిన వార్త తెలియి మానస తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. యువతి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button