
ప్రెస్‌క్లబ్ స్థలంపై ఎమ్మెల్యే సానుకూలత
ప్రజావాణిలో వినతికి స్పందన
ప్రెస్‌క్లబ్ కలకు కదలిక
ప్రెస్‌క్లబ్‌కు స్థలం.. తహసీల్దార్‌కు ఆదేశం
సీకే న్యూస్ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ ఆగస్టు 17 2026: జర్నలిస్టుల సంక్షేమం, వృత్తిపరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఏన్కూరు ప్రెస్‌క్లబ్‌కు సొంత భవనం నిర్మాణం కోసం ప్రభుత్వ భూమి కేటాయించేందుకు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ సానుకూలంగా స్పందించారు. సోమవారం నిర్వహించిన మండల ప్రజావాణికార్యక్రమంలో ఏన్కూరు ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు.
ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణానికి అవసరమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. భవన నిర్మాణానికి రెండు కుంటల ప్రభుత్వ భూమిని గుర్తించి కేటాయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని స్థానిక తహసీల్దార్‌ను ఆదేశించారు. ప్రజావాణి వేదికగా సమర్పించిన వినతిపై ఎమ్మెల్యే తక్షణమే స్పందించడం పట్ల ప్రెస్‌క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ప్రెస్‌క్లబ్‌కు సొంత భవనం ఏర్పాటైతే మండలంలోని జర్నలిస్టులు సమావేశాలు, మీడియా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఏన్కూరు ప్రెస్‌క్లబ్ చిరకాల ఆకాంక్ష అయిన సొంత భవన నిర్మాణానికి భూమి కేటాయింపు విషయంలో సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు ప్రెస్‌క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ భూమి గుర్తింపు, కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏన్కూరు ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, ప్రెస్‌క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




