
నిరుద్యోగ టీచర్లకు శుభవార్త: పార్ట్ టైమ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి
Web desc : నల్గొండ, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో పార్ట్ టైమ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రాయి ఆదివారం ప్రకటనలో తెలిపారు.నల్గొండ జిల్లాలో డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 19 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
ఆసక్తి కలిగిన వారు ఈనెల 22 సాయంత్రం 5 గంటల వరకు నల్గొండలోని మహిళా సమాఖ్య భవన్లో ఉన్న ప్రాంతీయ సమన్వయాధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి 24న ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు బాలుర గురుకుల పాఠశాల, అవంతిపురంలో ఇంటర్వ్యూ నిర్వహించనున్నట్లు తెలిపారు.
డిగ్రీ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్లు, పీజీటీ, టీజీటీ విభాగాల్లో మొత్తం 27 పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. డిగ్రీ లెక్చరర్లు 2 పోస్టులు, జూనియర్ లెక్చరర్లు 11 పోస్టులు, పీజీటీ 5 పోస్టులు, టీజీటీ 7 పోస్టులు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ 2 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.పీజీటీ, టీజీటీ అభ్యర్థులకు సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 50 శాతం, బీఈడీలో 50 శాతం, టెట్ పార్ట్ 2లో అర్హత ఉండాలని పేర్కొన్నారు.
జేఎల్ అభ్యర్థులకు పీజీ లేదా డిగ్రీలో 55 శాతం మార్కులతో పాటు బీఈడీలో 55 శాతం, టెట్ 2లో అర్హత ఉండాలని తెలిపారు. డిగ్రీ లెక్చరర్లకు పీజీ లేదా డిగ్రీలో 55 శాతం, పీహెచ్‌డీ లేదా నెట్ లేదా సెట్ అర్హత ఉండాలని పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లాలో 1:5 నిష్పత్తిలో ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని, సమాచారం కోసం 83339 25379 ఫోన్ నంబర్ ద్వారా సంప్రదించాలని సూచించారు.




