
పాముకాటుతో 18 నెలల చిన్నారి మృ*తి
నారాయణ పేట జిల్లా ఆగస్టు 22, (సి కే న్యూస్:
నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మల్రెడ్డిపల్లి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముశ్రీఫా మాణిక్యప్ప కుమారుడు శివ కార్తికేయ అనే 18 నెలల చిన్నారి పాముకాటుకు గురై మృ*తి చెందాడు.
కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. అర్ధరాత్రి సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారి పాముకాటుకు గురయ్యాడు. విషయాన్ని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే పరిస్థితి విషమించడంతో చిన్నారి మృ*తి చెందాడు.
చిన్నారి మృ*తితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృ*తితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




