
గర్ల్స్ హాస్టల్లో పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థినిలు…
web desc : ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో ఉన్న ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో తెలుగు, మణిపూర్ విద్యార్థినుల మధ్య ఘర్షణ జరిగింది. ఓ మొబైల్ ఫోన్ మాయం కావడంపై చెలరేగిన వివాదం, ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు, స్థానిక విద్యార్థులకు మధ్య ఘర్షణకు దారితీసింది.
ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఉన్నతాధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చి, విద్యార్థుల భద్రతను భరోసా కల్పించారు. ఆగస్టు 21న నర్సింగ్ కళాశాలలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఓ విద్యార్థికి చెందిన మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయింది. ఈ వివాదం కాస్తా ముదిరి మణిపూర్‌తో సహా ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులకు, తెలుగు మాట్లాడే విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణానికి దారితీసింది.
ఈ ఘటనలో కొద్దిమంది ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు గాయపడినట్లు సమాచారం. ఈ పరిణామంతో హాస్టల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ విషయంపై సమాచారం అందుకున్న ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించిన ఆయన, విద్యార్థుల భద్రత కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
సీఎం ఆదేశాల మేరకు స్పందించిన యంత్రాంగం, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యగా ఇరు వర్గాల విద్యార్థులను వేరుచేసింది. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన 31 మంది విద్యార్థులను వారి సమ్మతితో వేరే వసతి గృహానికి మార్చారు.
విద్యార్థులకు రక్షణగా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించారు. అధికారుల సకాల స్పందన పట్ల మణిపూర్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనపై మాజీ ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ కూడా ఎక్స్ (X) వేదికగా స్పందించి, ఏపీ సీఎం తీసుకున్న తక్షణ చర్యలను అభినందించారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఎలాంటి సమస్య లేదని అధికారులు వెల్లడించారు.




