
గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై..
మద్యం మత్తులో డివైడర్ ను ఢీకొట్టిన కారు….
కారు వదిలి వెళ్లిన కారు యజమాని
భారీగా ట్రాఫిక్ జాం
ట్రాఫిక్ ను క్లియర్ చేసిన గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు
సి కె న్యూస్ ప్రతినిధి గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా:
గద్వాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై కారు నడుపుతూ మద్యం మత్తులో ఉన్న యువకుడు బ్రిడ్జి పై డివైడర్ ను ఢీకొనడం జరిగింది.
డివైడర్ ను ఢీకొన్న అనంతరం మద్యం మత్తులో కారు నడుపుతున్న వ్యక్తి కారును వదిలి పరారైనట్లు సమాచారం. ఇతడు పెబ్బేరు మండలం రంగాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా సమాచారం. ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై ప్రమాదం జరగడంతో వాహనాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
సమాచారం తెలుసుకున్న గద్వాల ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రడు తోపాటు వారి సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేశారు.




