
ఖమ్మం గురుకుల పాఠశాలలో విషాదం.. గుండెపోటుతో విద్యార్థి మృతి..
ఖమ్మం గురుకుల పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు కారణంగా ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాయ్స్ గురుకుల పాఠశాలలో, 8వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల విద్యార్థి ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అప్రమత్తమైన సిబ్బంది చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ బాలుడు మరణించాడు. సమాచారం ప్రకారం, గుండెపోటు కారణంగానే ఈ అకస్మాత్తు మరణం సంభవించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
అయితే, మరణానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది. తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామానికి చెందిన హరీష్, ప్రియాంకల కుమారుడే ఈ సాత్విక్. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.




