
అగ్ని ప్రమాద బాదిత కుటుంబానికి ఉపాధ్యాయుల చేయుత
కట్టు బట్టలతో రోడ్డున పడ్డ కుటుంబం!
బెక్కెం జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయుల అండ
నిత్యావసరాల, వంట సామాగ్రి అందజేత
సికే న్యూస్ కొల్లాపూర్ ప్రతినిధి
చిన్నంబావి మండల పరిధిలోని గూడెం గ్రామంలో రోడ్డ బిచ్చన్న ఇంట్లో ఒక్కసారిగా సంభవించిన షార్ట్ సర్క్యూట్ తో అకుటుంబాన్ని రోడ్డున పడేసింది. కుటుంబ అవసరాల కోసం ఇంట్లో ఉన్న అన్ని వస్తువులు, వంట సామాగ్రి, నిత్యావసర సరుకులు మంటల్లో పూర్తిగా కాలిపోయి బూడిదయ్యాయి. కట్టు బట్టలతోనే ఇంటి నుంచి బయటపడిన ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో నిలిచింది. ఈ ప్రమాదంలో రోడ్డ బిచ్చన్నకు తీవ్ర గాయాలై వనపర్తి ఏరియా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నాడు.
ఈ విషాద ఘటన విషయం తెలుసుకున్న బెక్కెం గ్రామానికి చెందిన జడ్పీహెచ్ఎస్ స్కూల్ ఉపాధ్యాయులు మానవతా దృక్పథంతో స్పందించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ అవసరాలకు ఉపయోగపడే వంట సామాగ్రి, నిత్యావసర వస్తువులను అందజేసి అండగా నిలిచారు. ఆపదలో ఉన్న కుటుంబానికి తమవంతు సహాయాన్ని అందించిన ఉపాధ్యాయుల సేవలను గ్రామస్థులు అభినందించారు.
“కట్టుబట్టలతో మిగిలిన కుటుంబానికి.. మానవత్వమే అండగా నిలిచింది” అనేలా ఉపాధ్యాయులు చూపిన సేవా స్ఫూర్తి పలువురికి ఆదర్శంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో స్కూలు జిహెచ్ఎం విజయ వర్ధిని, రాధమ్మ, అనిత, సంజీవ్, స్వామి, రవి ఉపాధ్యాయుల సహసాకారంతో బాదిత కుటుంబానికి అండగా నిలిచారు.




