NagarkarnoolPoliticalTelangana

కౌలు రూ.2 లక్షలు.. సాగు ఖర్చు రూ.4 లక్షలు..

కౌలు రూ.2 లక్షలు.. సాగు ఖర్చు రూ.4 లక్షలు..

కౌలు రూ.2 లక్షలు.. సాగు ఖర్చు రూ.4 లక్షలు..

చివరకు పశువులకు మేతగా మారిన మొక్కజొన్న పంట

జూరాల నీళ్లు రాక వర్షాభావంతో రైతు కుటుంబానికి తీరని నష్టం

సీకే న్యూస్ కొల్లాపూర్

చిన్నంబావి మండల కేంద్రంలోని లక్ష్మీపల్లి గ్రామనికి చెందిన కౌలు రైతు మధుగం మహేష్ యాదవ్ 9 ఎకరాల భూమి కౌలుకు తీసుకొని మొక్కజొన్న పంట సాగు చేసిన పంట రైతు కుటుంబానికి కన్నీళ్లనే మిగిల్చింది. కౌలు రైతు మధుగం మహేష్ యాదవ్ కుటుంబం, మొక్క జోన పంట చేతికందకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది.

9 ఎకరాల భూమిని కౌలుకు ఖర్చు రూ.2 లక్షలు, మొక్కజొన్న సాగు కోసం మరో రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు రైతు కుటుంబం తెలిపింది. మొత్తం సుమారు రూ.6లక్షల పెట్టుబడి పెట్టిమొక్క జొన్న పంటపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వర్షాలు లేకపోవడంతో పాటు జూరాల కాలువకు సాగునీరు అందక పోవడంతో మొక్కజొన్న పంట పూర్తిగా ఎండిపోయింది.

పంటను కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినా నీరు అందకపోవడంతో చివరకు చేసేదేమీ లేక ఎండిపోయిన మొక్కజొన్న పంటను పశువులు, గొర్రెలకు మేతగా ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. పంట చేతికందకపోగా, కౌలు డబ్బులు, వ్యవసాయ పెట్టుబడి కోసం చేసిన అప్పులు కుటుంబంపై భారంగా మారాయి. పంట ద్వారా ఆదాయం వస్తుందని భావించిన రైతు కుటుంబానికి ఇప్పుడు పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

ఒక వైపు కౌలు భారం మరో వైపు వ్యవసాయ ఖర్చుల కోసం చేసిన అప్పులు దీంతో మధుగం మహేష్ యాదవ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. సాగు నీరు సకాలంలో అందక పోవడం వల్ల తమ లాంటి కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం తమ పంట నష్టాన్ని పరిశీలించి పంట నష్టప పరిహారం ఇవ్వాలని మధుగం మహేష్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button