
ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన కీసర సీఐ, ఎస్ఐ…
Web desc : అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు భారీ ఆపరేషన్ చేపట్టారు. 2026 సెప్టెంబర్ 17 అర్ధరాత్రి చేపట్టిన రైడ్స్ లో కీసర సీఐ, ఎస్సైలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.
లంచం తీసుకుంటూ దొరికినప్పటికీ కెమికల్ టెస్టుకు సహకరించకుండా తిప్పలు పెట్టడంతో లంచం నిర్ధారించడానికి ఆలస్యమైనట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 17న ఉదయం 7.30 గంటలకు రైడ్స్ సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
ఏసీబీ రైడ్స్ లో కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డిలు లంచం తీసుకుంటూ దొరకటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బాధితుడి నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ చేతికి చిక్కారు.
దీంతో ఎస్సై జ్ఞానేంద్ర రెడ్డి, ఇన్స్పెక్టర్ ఆంజనేయులును అరెస్టు చేశారు. పది క్వింటాళ్ల పీడీఎస్ రైస్ కేసు విషయంలో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు పది లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఇన్స్పెక్టర్. చివరికి బాధితుడితో 8 లక్షల 50 వేయిల రూపాయలకు ఒపందం చేసుకున్నారు.
సెప్టెంబర్ 2వ తేదీన బాధితుడి నుంచి 3 లక్షల 50 వేల రూపాయలు తీసుకున్నారు. మళ్ళీ సెప్టెంబర్ 17 అర్ధరాత్రి కీసర పెద్దమ్మ చెరువు దగ్గర కారులో 5 లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. ఏసీబీ అధికారులను చూసి ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి పరుగులు పెట్టారు.
లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్నారు ఇన్స్పెక్టర్ ఆంజనేయులు. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్ఐ జ్ఞానేంద్ర రెడ్డి ఏసీబీ అధికారులకు దొరకకుండా పరుగులు తీశారు.ఎస్సై, సీఐ ఇద్దరూ కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టినట్లు ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు తెలిపారు.




