
ఖమ్మంలో మైనర్ బాలిక పై అఘాయిత్యం! అవమానం తో ఎలుకుల మందు తాగిన బాలిక
-వరంగల్ లో చికిత్సా పొందుతూ మృతి
Web desc : ఖమ్మం నగరంలో ఓ మైనర్ బాలికపై అఘాయిత్యంకు సంబంధించిన విషాద ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సుమారు వారం రోజుల క్రితం ఓ బ్లాక్ లో ఉన్న సదరు బాలిక ను అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారనే ఆరోపణలు సంచలనంగా మారింది .
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక ఎలుకల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది. అక్కడ చికిత్స పొందుతున్న బాలిక బుధవారం ఉదయం మృతి చెందిన ఘటన తో కుటుంబ సభ్యుల్లో విషాదం నెలకొంది.
బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారనే యువకుడు పై పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు సమాచారం . ఇదే అంశంపై హవేలీ సీఐ భాను ప్రకాష్ ను వివరణ కోరగా కుటుంబీకులు ఓ యువకుడు పై ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారని సమగ్ర విచారణ జరిపిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు.
ఐతే ఈ ఘాటన పై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని సీపీఎం, మహిళా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, బాధ్యులెవరన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
యువతి మృతికి దారితీసిన పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపి, ఆరోపణలు నిజమని తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




