EducationKhammamPoliticalTelangana

బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యప్రవర్తన.. విడివిడిగా గదిలోకి పిలిచి.. ఆపై..

బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యప్రవర్తన.. విడివిడిగా గదిలోకి పిలిచి.. ఆపై..

బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్యప్రవర్తన.. విడివిడిగా గదిలోకి పిలిచి.. ఆపై..

భావి భారత పౌరులను తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయ వృత్తికి ఓ వ్యాయామ ఉపాధ్యాయుడు (పీడీ) మచ్చ తెచ్చాడు. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఆ ఉపాధ్యాయుడిని అధికారులు విధుల నుంచి తొలగించగా, పోలీసులు పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఖమ్మం గ్రామీణ ఎస్సై రాయుడు, మండల విద్యాధికారి శ్రీనివాస్ వెల్లడించిన వివరాల ప్రకారం..

ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో షఫిక్ అహ్మద్ పీడీగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా పాఠశాల వేళల్లో అమాయక విద్యార్థినులను వేర్వేరు గదులకు పిలిచి వారి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించేవాడు.

ఉపాధ్యాయుడి ప్రవర్తనతో తీవ్ర మనోవేదనకు గురైన బాలికలు, విసిగిపోయి ధైర్యం చేసి శుక్రవారం నాడు పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ప్రధానోపాధ్యాయుడు వెంటనే అప్రమత్తమై ఈ విషయాన్ని జిల్లా, మండల విద్యాధికారులకు చేరవేశారు. జిల్లా విద్యాశాఖాధికారి సదానందం ఆదేశాల మేరకు.. శనివారం ఎంఈఓ శైలజాలక్ష్మి, జీసీడీఓ రూబీ నేతృత్వంలో అధికారుల బృందం పాఠశాలను సందర్శించింది.

అక్కడ చదువుతున్న 16 మంది విద్యార్థినులను విడివిడిగా విచారించి వారి నుంచి వివరాలు సేకరించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. విద్యార్థినుల ఫిర్యాదులు నిజమని తేలడంతో డీఈఓ ఆదేశాల మేరకు ఆ పీడీని సర్వీసు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఎంఈఓ శ్రీనివాస్ తెలిపారు.

మరోవైపు, బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు షఫిక్ అహ్మద్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శనివారం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై రాయుడు పేర్కొన్నారు. పాఠశాలలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button