Khammam
Trending

సైబర్ మోసాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

సైబర్ మోసాల పట్ల విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి

అంతర్జాల వినియోగంలో అప్రమత్తతే రక్షణ

విద్యార్థులు సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

ఎయిడ్ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్

సీకే న్యూస్‌ ఖమ్మం ప్రతినిధి ఇస్లావత్ నరసింహ నవంబర్ 12 2026: నేటి ఆధునిక సాంకేతిక యుగంలో అంతర్జాలం, చరవాణి, చాట్‌జీపీటీ, కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు వాటిని సురక్షితంగా, అవసరమైన మేరకే ఉపయోగించాలని యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ అండ్ డెవలప్‌మెంట్ (ఎయిడ్) సంస్థ జిల్లా కోఆర్డినేటర్ కే. శ్రీనివాస్ సూచించారు.

స్థానిక జల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినీ విద్యార్థులకు సైబర్ భద్రత, బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంటూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞానం పెంపొందించుకునేందుకు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురువుల పట్ల గౌరవం, చదువుపట్ల అంకితభావం, క్రమశిక్షణ అలవర్చుకోవాలని తెలిపారు. మంచి వ్యక్తిత్వ నిర్మాణం పాఠశాల స్థాయి నుంచే ప్రారంభం కావాలని, మంచి వ్యక్తుల ద్వారానే మంచి సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా బాల్యవివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక దాడులు, బాలలు మరియు మానవ అక్రమ రవాణా, సైబర్ భద్రత, కెరీర్ గైడెన్స్ తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు అవగాహన కల్పించారు. బాలలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేష్, ఎయిడ్ సంస్థ టీమ్ మెంబర్ భాస్కర్, ఉపాధ్యాయులు నంద్య, నాగేశ్వరరావు, పార్థసారథి, ఉపేందర్, పుల్లయ్య, రామారావు, సైదులు, ఝాన్సీ, లక్ష్మి, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button