PoliticalSanga reddyTelangana

ఎక్కుతుండగా కదిలిన ఆర్టీసీ బస్సు.. విద్యార్థిని కాలుపై నుంచి వెళ్లిన చక్రం

ఎక్కుతుండగా కదిలిన ఆర్టీసీ బస్సు.. విద్యార్థిని కాలుపై నుంచి వెళ్లిన చక్రం

ఎక్కుతుండగా కదిలిన ఆర్టీసీ బస్సు.. విద్యార్థిని కాలుపై నుంచి వెళ్లిన చక్రం

ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు ఓ విద్యార్థిని బస్సు చక్రాల కింద పడిన ఘటన సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్ బస్టాండ్‌లో సోమవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థిని కాలుపై నుంచి బస్సు చక్రం వెళ్లడంతో తీవ్ర గాయాలైనట్లు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం కాగజ్ మద్దూర్ గ్రామానికి చెందిన కుసంగి సంజన దౌల్తాబాద్‌లోని సాయి రిషి ఒకేషనల్ కాలేజీలో చదువుకుంటోంది.

సోమవారం కాలేజీ ముగిసిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు దౌల్తాబాద్ బస్టాండ్‌కు చేరుకుంది. బస్సు ఎక్కే ప్రయత్నం చేస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా కదలడంతో సంజన అదుపుతప్పి కిందపడిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్సు చక్రం ఆమె కాలుపై నుంచి వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమా? బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును కదపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టి, డ్రైవర్‌పై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button