
నోటీసులతోనే కాలయాపనా ? మరి చర్యలేవి ?
గతంలో రాజా రామ్మోహన్ కోచింగ్ సెంటర్ పై ఫిర్యాదు చేసిన పట్టించుకోని అధికారులు.
క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ కరువు.
అయిజ సెప్టెంబర్ 22
అయిజ పట్టణంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు. అమాయక ప్రజల అశలను సద్వినియోగం చేసుకుంటూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తూ ధనార్జన ధ్యేయంగా కోచింగ్ సెంటర్ నడిపిస్తున్నాయని తల్లిదండ్రుల ఆవేదన. ప్రైవేట్ స్కూళ్లలో వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివించే స్తోమత లేక ఇలా గురుకుల, నవోదయ విద్యాలయంలో చేర్పిస్తే తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని చిన్న ఆశతో ఇక్కడ చేర్పిస్తే ఇక్కడ కూడా ఇలా వేలకు వేలు అప్పు చేసి కోచింగ్ సెంటర్లకు చెల్లిoచే దుస్థితి ఏర్పడిందని ఆవేదన చెందారు.
వారి బలహీనతను ఆసరా చేసుకుని మీకు సీటు గ్యారంటీ తప్పకుండా నవోదయ గురుకుల సీట్లు తెప్పిస్తామంటూ పిల్లల తల్లిదండ్రులను నమ్మ పలికి కోచింగ్ సెంటర్లు పోటీపడి మరి పిల్లల్ని చేర్పించుకుంటున్నారని,ఒక్కొక్క విద్యార్థికి 25 లేదా 30,000 చొప్పున పీజులు వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రుల దగ్గర ముక్కు పిండి మరి వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు చర్చించుకుంటున్నారు.
ప్రభుత్వ నిబంధనలను గాలికి వదిలేశారు .
అయిజలో చాలా కోచింగ్ సెంటర్లు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను తీసుకొచ్చి కోచింగ్ సెంటర్లు నడిపిస్తున్నారు . వాస్తవానికి ఇటువంటి కోచింగ్ సెంటర్లకు అనుమతులు ఉండవు. విద్యార్థులు చదువుతున్న పాఠశాలలో పాఠశాల యాజమాన్యం ఎలా అనుమతిలిస్తాయో ? అని ప్రజల్లో సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతున్నాయి.
ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల వారు వారి హాజరు పట్టికను ఎలా మేనేజ్ చేస్తారు ? ఇట్టి విషయం మండల విద్యాశాఖ అధికారికి తెలియకుండానే జరుగుతున్నాయా ? అని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి ? కోచింగ్ సెంటర్లు అంటే ఉదయం సాయంత్రం సమయాలలో శిక్షణ ఇవ్వాలి కానీ రాత్రి పగలు తేడా లేకుండా పిల్లలను మరి బందీలు చేసి శిక్షణ ఇస్తూ మానసిక వేదన గురి చేస్తున్నారని అనుకుంటున్నారు.
అయిజలోని రాజా రామ్మోహన్ నవోదయ కోచింగ్ సెంటర్ పై గతంలో విజయ క్రాంతి పత్రికలో వచ్చిన కథనాలు చూసి తూతూ మంత్రంగా నోటీసులు పంపించి అధికారులు చేతులు దులుపుకున్నారని,రాజా రామ్మోహన్ నవోదయ కోచింగ్ సెంటర్ యాజమాన్యం ఉదయం సాయంత్రం మాత్రమే శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పాఠశాలల పనివేళల్లో మేము శిక్షణ ఇవ్వమని సమాధానం రాసిచ్చిన తర్వాత కూడా రాత్రి పగలు విద్యార్థులు కోచింగ్ సెంటర్ లోనే ఉండడం గమనార్హం. మరియు పట్టణ గ్రామాల్లో ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే ఈ కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్నారని,అనుమతులు లేని కోచింగ్ సెంటర్ల పై అధికారుల పర్యవేక్షణ డొల్లతనం కనిపిస్తుందని ప్రజలు అనుకుంటున్నారు.
ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఇంత బహటంగానే నడుపుతున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తుంటే విద్య అధికారుల యాజమాన్యంతో చీకటి ఒప్పందం నడిచాయా ? అన్న అనుమానాలు కలుగుతున్నాయని,బోర్డులు పెట్టి కోచింగ్ సెంటర్లు నడుపుతున్న మా దృష్టికి రాలేదు అని మండల విద్యాశాఖ అధికారి అనడం హాస్యాస్పదంగా ఉన్నదని ప్రజలు, ప్రజా సంఘాలు చర్చించుకుంటున్నాయి.
మండల విద్యాశాఖ అధికారి వివరణ
మీరు పత్రికల్లో రాయండి మీ ప్రచురణను బట్టి పై అధికారులు జిల్లా కలెక్టర్ కానీ జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా మాకు చర్యలు తీసుకోమని ఉత్తర్వులు పంపితే అప్పుడు మేము చర్యలు తీసుకుంటాం మండల విద్యాధికారి రాము దయాల్ అనడం కోసం మెరుపు.
ఇకనైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నడిపే కోచింగ్ సెంటర్లపై అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి సరియైన వసతులు లేని ప్రైవేట్ పాఠశాలలు , ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు జరుపుతున్న ధన దోపిడిని అరికట్టి, పేద పిల్లలకు అనువైన పద్ధతిలో శిక్షణ ఇస్తూ వారి బంగారు భవిష్యత్తుకు భరోసా ఇవ్వాలని ప్రజా సంఘాలు మరియు ప్రజలు అధికారులను కోరుతున్నారు.




