Jogulamba gadwalPoliticalTelangana

10 గంటలకు డ్యూటీ.. 11 దాటినా కనిపించని అధికారులు!

10 గంటలకు డ్యూటీ.. 11 దాటినా కనిపించని అధికారులు!

సమయపాలనకు ‘సెలవు’!

  • 10 గంటలకు డ్యూటీ.. 11 దాటినా కనిపించని అధికారులు!
  • మధ్యాహ్నానికే ఇంటిబాట.. మానవపాడు మండలంలో ప్రభుత్వ కార్యాలయాల తీరు

అలంపూర్‌, సెప్టెంబర్‌ 28:

మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సమయపాలన గాడి తప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటలకు విధులకు హాజరు కావాల్సి ఉండగా.. 11 గంటలు దాటినా కొందరు అధికారులు, సిబ్బంది కార్యాలయాలకు రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. వచ్చినా కొద్దిసేపటికే బయటకు వెళ్లడం, మధ్యాహ్నానికే కార్యాలయాలు ఖాళీ చేయడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా మహిళా సమాఖ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,ఐసీడీఎస్‌, పంచాయతీ రాజ్, జాతీయ ఉపాధి హామీ పథకం వంటి కార్యాలయాల్లో సమయపాలనపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు అందుబాటులో లేకపోవడంతో వివిధ పనులపై వచ్చే ప్రజలు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు.

ఒక్క పని కోసం పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని గ్రామీణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉదయం 10 గంటలకే విధులు ప్రారంభం కావాల్సిన చోట 11 గంటలకూ అధికారులు కనిపించకపోవడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

స్థానిక తహసీల్దార్, ఎంపిడిఓ కార్యాలయాలకు కూతవేటు దూరంలో ఉన్న ఈ కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది ఇష్టానుసారంగా రాకపోకలు కొనసాగిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, హాజరు,విధుల నిర్వహణపై కఠినంగా పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button